
నేడు ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ జడ్జి స్టే విధించడంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచిని ఆశ్రయించగా, దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన నిన్న విచారణ చేపట్టిన ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసి ఎన్నికలు నిర్వహణకు అనుమతించింది. అయితే ఈ కేసుపై తుది తీర్పు వెలువదేవరకు ఫలితాలు ప్రకటించవద్దని ఆంక్ష విధించింది.
ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పోలింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉండటంతో నేడు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి.