త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీ: మంత్రి హరీష్‌

మంత్రి హరీష్‌రావు సోమవారం సిద్ధిపేటజిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 1.34 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. త్వరలోనే మరో 50,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం. అందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కనుక యువత ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దు. త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయబోతున్నాము కనుక యువత్ ఆ ఉద్యోగాలను సాధించేందుకు సిద్దమవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.