
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలంగాణ సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, నాగార్జునసాగర్ టిఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ కుమార్‌లను ప్రశంశిస్తూ ట్వీట్స్ పెట్టారు.
ఒక ట్వీట్‌లో సిఎం కేసీఆర్ సింహం, మంత్రి కేటీఆర్ పులివంటివారని ప్రశంశిస్తూనే, చిరుతపులిని వాకింగ్ తీసుకువెళుతున్న నోముల భగత్ కుమార్‌ను తాను ఇంకా ఎక్కువ ఇష్టపడుతున్నానని అన్నారు. ఒకవేళ తనకే గనుక నాగార్జునసాగర్ నియోజకవర్గం ఓటుహక్కు కలిగిఉంటే తాను తప్పకుండా నిజజీవితంలో హీరోగా ఉన్న అతనికే ఓటువేసి ఉండేవాడినని వర్మ ట్వీట్ చేశారు. దీంతో పాటు నోముల భగత్ కుమార్ చిరుతపులిని వాకింగ్ తీసుకువెళుతున్న వీడియోను కూడా వర్మ పోస్ట్ చేశాడు.
మరో ట్వీట్‌లో “నోముల భగత్ మాకు ఓటు వేయండని ఓటర్లను అభ్యర్ధిస్తున్నాడు. మాకు అంటే తనకు తన టిఆర్ఎస్ పార్టీకి. నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో సింహంలా గర్జిస్తామని, మరే పార్టీకి అవకాశమే లేదని చెపుతున్నాడు. ఇంతవరకు చరిత్రలో చిరుతపులిని వెంటబెట్టుకొని ఎన్నికల ప్రచారం చేసిన వ్యక్తిని నేను ఎన్నడూ చూడలేదు. హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్, కేటీఆర్, టిఆర్ఎస్,” అని మెసేజ్ వర్మ పెట్టాడు.