సాగర్ బరిలో 78 మంది అభ్యర్ధులు

నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు నిన్న సాయంత్రం నామినేషన్ల గడువు ముగిసేసరికి మొత్తం 78 మంది అభ్యర్ధులు 128 సెట్ల నామినేషన్లు వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రోమిత్ సింగ్‌ తెలిపారు. చివరి రోజైన నిన్న ఒక్కరోజే టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీల అభ్యర్ధులతో సహా మొత్తం 58 మంది అభ్యర్ధులు 105 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. 

కాంగ్రెస్‌ అభ్యర్ధి కె.జానారెడ్డి సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, పిసిసి కార్యదర్శి కె.మల్లయ్య తదితరులతో కలిసివచ్చి నామినేషన్ వేశారు.  

టిఆర్ఎస్‌ అభ్యర్ధి నోముల భగత్ కుమార్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, పార్టీ నేతలతో కలిసివచ్చి నామినేషన్ వేశారు.  

బిజెపి అభ్యర్ధి డాక్టర్ రవికుమార్ నాయక్ ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ ముఖ్యనేతలు శ్రీశైలం గౌడ్, గొంగిడి మనోహర రెడ్డి తదితరులతో కలిసివచ్చి నామినేషన్ వేశారు. 

ఉపఎన్నికల షెడ్యూల్: 

నామినేషన్ల పరిశీలన : మార్చి 31

 నామినేషన్ల ఉపసంహరణ : ఏప్రిల్ 3

 సాగర్ ఉపఎన్నిక : ఏప్రిల్ 17

కౌంటింగ్ మరియు ఫలితాలు : మే 2