జూనియర్ కార్యదర్శులకు శుభవార్త

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న జూనియర్ కార్యదర్శులకు ఓ శుభవార్త! ఏప్రిల్ 1వ తేదీ నుంచి వారికి కూడా రెగ్యులర్ కార్యదర్శులతో పాటు రెగ్యులర్‌గా జీతాలు చెల్లిస్తామని సిఎం కేసీఆర్‌ ఈరోజు శాసనసభలో ప్రకటించారు. “మేము కడుపులు నింపేటోళ్ళమే కానీ కడుపులు కొట్టేటోళ్ళాం కాము. వారికి కూడా కడుపు నిండా పెడతాం. వారు కూడా సంతోషంగా ఉండాలి. అయితే వారి ప్రొబేషనరీ పీరియడ్ (శిక్షణ సమయం) మరో ఏడాది పెంచుతాం. వారి కృషి కారణంగానే గ్రామాలలో హరితవనం పధకంలో భాగంగా నాటిన మొక్కలు ఎపుగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పచ్చదనం పెరుగుతోంది. కనుక ఏప్రిల్ 1వ తేదీ నుంచి వారికి కూడా రెగ్యులర్ కార్యదర్శులతో పాటు రెగ్యులర్‌గా జీతాలు చెల్లిస్తాం,” అని సిఎం కేసీఆర్‌ చెప్పారు.