త్వరలో 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్: మంత్రి హరీష్‌

తెలంగాణ ఆర్ధికమంత్రి హరీష్‌రావు గురువారం శాసనసభలో మాట్లాడుతూ, “త్వరలోనే 50,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ జారీ చేస్తాము. ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచినందున నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయనే వాదన సరికాదు. ఎప్పటికప్పుడు ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ, ఖాళీ అయిన ఆ పోస్టులను భర్తీ చేస్తాము. మన దేశంలో వివిద రాష్ట్రాలలో విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్ళు ఉంది. అలాగే కొన్ని ఉద్యోగాల ప్రాధాన్యతను బట్టి 65 ఏళ్ళు కూడా ఉంది. కనుక పదవీ విరమణ వయసు పెంపుకు, ఉద్యోగావకాశాలకు ఎటువంటి సంబందమూ ఉండదు,” అని అన్నారు.

ప్రస్తుతం నాగార్జునసాగర్ ఉపఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ పీఆర్సీని ప్రకటిచేందుకు అనుమతించినందున, రాష్ట్ర ప్రభుత్వం కోరితే 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించవచ్చు. ఒకవేళ అనుమతించకపోతే ఏప్రిల్ 17న పోలింగ్ ముగిసేవరకు వేచి చూడక తప్పదు.