సాగర్ ఉపఎన్నికలకు టిఆర్ఎస్‌, బిజెపి అభ్యర్ధులు ఖరారు?

వచ్చే నెల 17న జరుగబోయే నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు ఈనెల 30వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. కాంగ్రెస్ అభ్యర్ధిగా సీనియర్ నేత కే.జానారెడ్డి పోటీ చేస్తున్నట్లు నెలరోజుల క్రితమే ఆ పార్టీ ప్రకటించింది. కానీ టిఆర్ఎస్‌, బిజెపిలు మాత్రం ఇంకా పార్టీ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేయలేదు. రెండు పార్టీలు గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతున్నాయి. 

తాజా సమాచారం ప్రకారం టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ అల్లుడు గురవయ్యకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయన ఆర్ధికంగా, రాజకీయంగా బలమైన అభ్యర్ధి అని టిఆర్ఎస్‌ అధిష్టానం భావిస్తునందున ఆయన పేరు ఖరారు చేసినట్లు సమాచారం.  

ఇక బిజెపి కూడా పార్టీ అభ్యర్ధిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సాగర్ నియోజకవర్గంలో చిరకాలంగా గిరిజనులకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ రవినాయక్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. రెండు పార్టీలు రేపు అభ్యర్ధుల పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.      

సాగర్ ఉపఎన్నికల షెడ్యూల్: 

మార్చి 23: నోటిఫికేషన్‌ జారీ, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం 

మార్చి 30: నామినేషన్ల దాఖలుకి గడువు

మార్చి 31: నామినేషన్ల పరిశీలనఏప్రిల్ 3: నామినేషన్ల ఉపసంహరణకు గడువు

ఏప్రిల్ 17: పోలింగ్

మే 2: ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన.