
కరోనా కేసులు మళ్ళీ పెరగడంతో రాష్ట్రంలో విద్యాసంస్థలన్నీ నేటి నుంచి మూసివేసిన సంగతి తెలిసిందే. త్వరలో సినిమా థియేటర్లను కూడా మూసివేయబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ, “సినిమా థియేటర్లను మూసివేయబోతున్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదు. ప్రభుత్వం అటువంటి ఆలోచన చేడంలేదు కూడా. ఎందుకంటే సినీ పరిశ్రమపై కొన్ని లక్షలమంది ఆధారపడి జీవిస్తున్నారు. థియేటర్లు మూసివేస్తే వారందరూ తీవ్రంగా నష్టపోతారు. కనుక ఎప్పటిలాగే కరోనా నిబందనలు పాటిస్తూ సినిమా థియేటర్లు నడుస్తాయి. కనుక దీనిపై ఎవరూ పుకార్లు సృష్టించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.