సాగర్ ఉపఎన్నికల నోటిఫికేషన్‌ జారీ

రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న నాగార్జునసాగర్ ఉపఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించింది. దీంతో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు జిల్లా ఎన్నికల నిర్వహణ అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.  ఈ ఉపఎన్నికలకు మిర్యాలగూడ ఆర్డీవోను రిటర్నింగ్ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలిపారు. సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 17న ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించిన తొలిరోజే ఐదుగురు స్వతంత్ర అభ్యర్ధులు నామినేషన్లు వేశారు. 

సాగర్ ఉపఎన్నికల షెడ్యూల్: 

మార్చి 23: నోటిఫికేషన్‌ జారీ, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం 

మార్చి 30: నామినేషన్ల దాఖలుకి గడువు

మార్చి 31: నామినేషన్ల పరిశీలనఏప్రిల్ 3: నామినేషన్ల ఉపసంహరణకు గడువు

ఏప్రిల్ 17: పోలింగ్

మే 2: ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన.