1.jpg)
తెలంగాణ సిఎం కేసీఆర్ నిన్న శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్మెంట్తో పాటు ఇంకా అనేక వరాలు ప్రకటించడంతో వారు సంతోషంగా సంబురాలు జరుపుకొంటున్నారు. సిఎం కేసీఆర్ ప్రకటించిన వరాలలో కొన్ని ముఖ్యాంశాలు:
• ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 సం.లకి పెంచుతున్నాము.
• రాష్ట్రంలో అర్హులైన ఉద్యోగులు, ఉపాద్యాయులు అందరికీ పదోన్నతులు కల్పిస్తాం.
• పదోన్నతుల ప్రక్రియతో ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేస్తాం.
• వీలైనంత త్వరగా బదిలీలో ప్రక్రియ పూర్తి చేస్తాం.
• ప్రాధమిక పాఠశాలలలో మొత్తం 10,000 మంది ఉపాధ్యాయులు ఉండేవిదంగా అదనపు ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేస్తున్నాం. వారికి స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉంటుంది.
• పీఆర్సీ 12 నెలల బకాయిలను రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో కలిపి అందిస్తాం.
• ఉద్యోగులు, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ గ్రాడ్యూటీని రూ.12 నుంచి 16 లక్షలకు పెంచుతాము.
విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగులకు సీపీఎస్ (కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను వారి కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ విదానాన్ని అమలుచేస్తాం.