
టిడిపి, దాని అధినేత చంద్రబాబునాయుడు పట్ల టిఆర్ఎస్ నేతలకు ఎటువంటి అభిప్రాయం ఉందో తెలియంది కాదు. కానీ ఈరోజు ఏపీ టిడిపి నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో జరుగుతున్న పోరాటాలకు మంత్రి కేటీఆర్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అవసరమైతే తాను విశాఖపట్నం వచ్చి వారి పోరాటానికి సంఘీభావం తెలుపుతానని మంత్రి కేటీఆర్ కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. కనుక కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు, మంత్రి కేటీఆర్‌ను విశాఖకు రావలసిందిగా ఆహ్వానించారు. అయితే ప్రస్తుతం శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున అవి పూర్తయిన తరువాత విశాఖ పర్యటనపై నిర్ణయం తీసుకొంటానని మంత్రి కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. మంత్రి కేటీఆర్, గంటా శ్రీనివాసరావు భేటీ ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో?