ఆ విద్యార్దులందరినీ పైతరగతులకు ప్రమోట్?

రాష్ట్రంలోని పలు పాఠశాల విద్యార్దులు కరోనా బారిన పడుతుండటంతో 6, నుంచి 9వ తరగతి విద్యార్దులకు పాఠశాలలో ప్రత్యక్ష బోధన నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. వారికి మళ్ళీ ఇళ్ళ వద్దే ఆన్‌లైన్‌లో పాఠాలు భోదించాలని భావిస్తోంది. ఈ నేపధ్యంలో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్దులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. పదో తరగతి విద్యార్దులకు బోర్డ్ పరీక్షలు వ్రాయవలసి ఉంటుంది కనుక వారికి మాత్రం యదాతధంగా ప్రత్యక్ష బోధన కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒకటి రెండు రోజులలో వీటన్నిటిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.