.jpg)
తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల కోసం బుదవారం ఉదయం నుంచి నిర్విరామంగా ఓట్ల లెక్కింపు జరుగుతోంది కానీ ఇంతవరకు విజేత ఎవరో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. ఈరోజు సాయంత్రంలోగా లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
శుక్రవారం రాత్రి 8 గంటలకు రెండు నియోజకవర్గాలలో అతితక్కువ ఓట్లు పొందిన అభ్యర్ధుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా ప్రధాన అభ్యర్దులకు వచ్చిన ఓట్లు:
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం:
సురభి వాణిదేవి (టీఆర్‌ఎస్): 1,12,802 ఓట్లు
ఎన్.రాంచందర్‌రావు(బీజేపీ): 1,04,965 ఓట్లు
కె.నాగేశ్వర్ (స్వతంత్ర అభ్యర్ధి): 53,687 ఓట్లు
చిన్నారెడ్డి (కాంగ్రెస్): 31,602 ఓట్లు
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం:
పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్): 1,11,190 ఓట్లు
తీన్మార్ మల్లన్న (స్వతంత్ర అభ్యర్ధి): 83,629 ఓట్లు
కోదండరాం (టీజేఎస్): 70,742 ఓట్లు
గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ): 39,268 ఓట్లు
రాములు నాయక్(కాంగ్రెస్): 27,713 ఓట్లు