తెలంగాణ రాజకీయాలలో ప్రవేశించుకు సిద్దమవుతున్న వైఎస్ షర్మిళ ఇంటికి రాష్ట్రంలో ప్రముఖులు క్యూ కడుతుండటం విశేషం. భారత్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు అసుదుద్దీన్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సోదరి ఆనం మీర్జా దంపతులు శుక్రవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నివాసంలో షర్మిళను కలిశారు. అనంతరం వారిరువురూ మీడియాతో మాట్లాడుతూ, “కేవలం మర్యాదపూర్వకంగానే షర్మిళను కలిశాము తప్ప వేరే కారణాలేవీ లేవని” చెప్పారు. వారిరువురూ షర్మిళ పెట్టబోయే రాజకీయ పార్టీలో చేరుతారా లేదా అనే విషయం పక్కనబెడితే, తెలంగాణ రాష్ట్రంలో షర్మిళకు ఇంకా గుర్తింపుందని ప్రముఖుల పలకరింపులతో స్పష్టం అవుతోంది. అయితే ఆమెకు రాష్ట్రంలో ప్రజాధారణ లభిస్తుందా లేదా అనే విషయం ఆమె ఏప్రిల్ 9న పార్టీని ప్రకటించి పూర్తిస్థాయి రాజకీయాలలోకి ప్రవేశించిన తరువాతే తెలుస్తుంది.