రెండో దశ కౌంటింగ్‌లో 16 అభ్యర్ధులు తొలగింపు

వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్ధికి 51 శాతం ఓట్లు రాకపోవడంతో నిబందనల ప్రకారం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా తక్కువ ఓట్లు పోలైన 16 మంది అభ్యర్ధులను జాబితాలో తొలగించి వారికి పడిన రెండో ప్రాధాన్యత ఓట్లను అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్ధులకు కలిపి లెక్కింపు మొదలుపెట్టారు. 

మొదటి నుంచి ఆధిక్యతలో కొనసాగుతున్న టిఆర్ఎస్‌ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 7 రౌండ్లలో కలిపి మొత్తం 1,10,840 ఓట్లు, ఆయన సమీప ప్రత్యర్ధి తీన్మార్ మల్లన్నకు 83,290, ప్రొఫెసర్ కోదండరాంకు 70,072, ప్రేమేందర్ రెడ్డికి 39,107, రాములు నాయక్‌కు 27,588 ఓట్లు మాత్రమే వచ్చాయి. కనుక 51 శాతం ఓట్లు వచ్చేవరకు ఈ ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూ, తొలగించిన అభ్యర్ధుల ఓట్లను పైఅభ్యర్ధుల ఖాతాలో కలుపుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తారు. బహుశః ఈరోజు మధ్యాహ్నం 3 గంటలలోగా పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.