
రెండు ఎమ్మెల్సీ స్థానాలలో టిఆర్ఎస్ విజయం సాధించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో తొలి రౌండ్ (ఓట్ల లెక్కింపు) నుంచే టిఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యతలో కొనసాగుతున్నారు. కొద్దిసేపటి క్రితం ముగిసిన నాలుగవ రౌండ్‌లో కూడా ఆయన ఆధిక్యతలో నిలిచారు. పల్లాకు 4వ రౌండ్‌లో 63,442 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 48,004, టిజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు 39,615, బిజెపి అభ్యర్ధి ప్రేమేందర్ రెడ్డికి 23,703, కాంగ్రెస్ అభ్యర్ధి రాములు నాయక్‌కు 15,934 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్‌లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి తన సమీప ప్రత్యర్ధి తీన్మార్ మల్లన్నపై 15,438 ఓట్లు ఆధిక్యతలో ఉన్నారు.
నాలుగు రౌండ్‌లలో ప్రధాన అభ్యర్ధులకు పోలైన ఓట్లు:
పల్లా రాజేశ్వర్ రెడ్డి (టిఆర్ఎస్): 63,442 ఓట్లు.
తీన్మార్ మల్లన్న(స్వతంత్ర అభ్యర్ధి): 48,004 ఓట్లు.
ప్రొఫెసర్ కోదండరాం (టిజేఎస్) : 39,615 ఓట్లు.
ప్రేమేందర్ రెడ్డి (బిజెపి): 23,703 ఓట్లు
రాములు నాయక్ (కాంగ్రెస్): 15,934 ఓట్లు పోలయ్యాయి.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో రాత్రి 8 గంటల వరకు మూడు రౌండ్‌ల ఓట్ల లెక్కింపు పూర్తవగా వాటిలో టిఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణీదేవి ఆధిక్యతలో నిలిచారు.