మూడో రౌండ్‌లో కూడా ఆధిక్యతలో పల్లా

వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి మొదటి రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఆధిక్యతలో ఉండగా ఇప్పుడు మూడో రౌండ్‌లో కూడా తన సమీప ప్రత్యర్ధి తీన్మార్ మల్లన్నపై 11,687 ఓట్ల ఆధిక్యతలో నిలిచారు. 

మూడో రౌండ్‌లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 15,558 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 11,742, టిజేఎస్‌ అభ్యర్ధి ప్రొఫెసర్ కోదండరాంకు 11,039, బిజెపి అభ్యర్ధి ప్రేమేందర్ రెడ్డికి 5,320 , కాంగ్రెస్‌ అభ్యర్ధి రాములు నాయక్‌కు 4,333 ఓట్లు పోలయ్యాయి. 

దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇప్పటివరకు మూడు రౌండ్‌లలో కలిపి 47,545 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇంకా మరో నాలుగు రౌండ్స్ ఓట్ల లెక్కింపూ పూర్తి కావలసి ఉంది. ఈరోజు రాత్రికి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది.