1.jpg)
ఆర్ధికమంత్రి హరీష్‌రావు 2021-22 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఈరోజు ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో రోడ్లు, భవనాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బుదవారం రాత్రి ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గసమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించారు. ఈసారి బడ్జెట్ 2.25 లక్షల కోట్లకు పైగా ఉండవచ్చని సమాచారం.
ఈఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగినందున ఈసారి బడ్జెట్‌లో ఎటువంటి కోతలు ఉండబోవని, అన్ని అభివృద్ధి, సంక్షేమ పధకాలకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తామని మంత్రి హరీష్‌రావు కొన్నిరోజుల క్రితమే చెప్పారు. నిరుద్యోగ భృతిపై వెనక్కు తగ్గేది లేదని త్వరలోనే ఆ హామీని అమలుచేస్తామని సిఎం కేసీఆర్ నిన్ననే శాసనసభలో చెప్పారు కనుక నేడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో దాని కోసం నిధులు కేటాయిస్తారో లేదో చూడాలి.