
సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్‌లో ఓ మూడంతుస్తుల భవనం హటాత్తుగా కూలిపోయింది. అయితే ఆ సమయంలో ఆ భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దాని పక్కనే కొత్తగా ఓ భవనం నిర్మించేందుకు పునాదులు తవ్వుతుండగా అది కూలిపోయినట్లు స్థానికులు తెలిపారు. కొత్త భవనం నిర్మించే చోట బోరు వేయడానికి వచ్చిన కొంతమంది కార్మికులు అప్పటివరకూ ఆ కూలిపోయిన భవనంలోనే ఉన్నారు. కానీ అంతకు ముందే వారందరూ బయటకు వెళ్ళిపోవడంతో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. సమీపంలో ఉన్న ఓ వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. అతనిని ఆసుపత్రికి తరలించి ప్రదమ చికిత్స చేసి పంపించారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.