ధరణీలో కొత్త ఆప్షన్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణీ పోర్టల్‌లో మరో కొత్త ఆప్షన్ జోడించింది. ధరణీ ద్వారా దరఖాస్తు  చేసుకొన్న సేవలు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో తెలుసుకొనేందుకు దీంతో వీలుకలుగుతుంది. ఉదాహరణకు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పార్టిషన్, సక్సేషన్ వంటి సేవల కోసం దరఖాస్తు చేసుకొన్న తరువాత వాటి ప్రక్రియ ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దరఖాస్తు సంఖ్య లేదా సదరు లావాదేవీకి సంబందించిన సంఖ్యతో ధరణీ పోర్టల్‌ ద్వారానే వాటి పరిస్థితి తెలుసుకోవచ్చు. అలాగే ధరణీ పోర్టల్‌ ప్రవేశపెట్టక నునుపు వ్యవసాయభూమిని వ్యవసాయేతర అవసరాలకు భూమార్పిడి కోరుతూ దరఖాస్తు చేసుకొన్నవారికి, ఒకవేళ నేటికీ ఆ భూమార్పిడి జరుగకపోయుంటే ఆ వివరాలను ధరణీలో నమోదు చేసుకొనేందుకు వీలు కల్పించింది.