రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాలలో టిఆర్ఎస్‌ ఆధిక్యత

రెండు ఎమ్మెల్సీ స్థానాలలో మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి టిఆర్ఎస్‌ అభ్యర్ధులు ఆధిక్యతలో ఉన్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టిఆర్ఎస్‌ అభ్యర్ధి సురభి వాణీదేవికి 17,439, బిజెపి అభ్యర్ధి రామచందర్ రావుకి 16,385, స్వతంత్ర అభ్యర్ధి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కి 8,357, కాంగ్రెస్‌ అభ్యర్ధి చిన్నారెడ్డికి 5,082 తొలి ప్రాధాన్యత ఓట్లు పడ్డాయి. దీంతో ప్రస్తుతం సురభి వాణీదేవి తన సమీప బిజెపి అభ్యర్ధిపై 1,044 ఓట్లు ఆధిఖ్యతలో ఉన్నారు. 

ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 93 మంది అభ్యర్ధులు పోటీ చేశారు. మొత్తం 3,57,354 ఓట్లు పోలయ్యాయి. ఒక్కో రౌండ్‌లో 56,000 ఓట్లు చొప్పున మొత్తం ఏడు రౌండ్లలో ఓట్లు లెక్కిస్తున్నారు. 

వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా రెండు రౌండ్స్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. రెంటిలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి అధిక్యతలో ఉన్నారు.

మొదటి రౌండ్‌లో పల్లాకు 16,130 ఓట్లు, తీన్‌మార్ మల్లన్న 12,046, టిజేఎస్‌ అభ్యర్ధి ప్రొఫెసర్ కోదండరాంకు 9,080, బిజెపి అభ్యర్ధి ప్రెందర్ రెడ్డికి 6,615, కాంగ్రెస్‌ అభ్యర్ధి రాములు నాయక్ 4,345, రాణీరుద్రమదేవికి 1,123, చెరుకు సుధాకర్‌కి 1,077, జయసారధిరెడ్డికి 1,008 ఓట్లు పడ్డాయి. సమీప ప్రత్యర్ధిపై 4,084 ఓట్ల అధిక్యతలో ఉన్నారు. 

రెండో రౌండ్‌లో పల్లాకు 15,857ఓట్లు, తీన్‌మార్ మల్లన్న 12,070, టిజేఎస్‌ అభ్యర్ధి ప్రొఫెసర్ కోదండరాంకు 9448, బిజెపి అభ్యర్ధి ప్రెందర్ రెడ్డికి 6,669 కాంగ్రెస్‌ అభ్యర్ధి రాములు నాయక్ 3,244 ఓట్లు పడ్డాయి. రెండో రౌం డ్‌లో పల్లా రాజేశ్వర్ రెడ్డి సమీప ప్రత్యర్ధిపై 3,787 ఓట్లు ఆదిక్యతలో ఉన్నారు. 

ఈ నియోజకవర్గం నుంచి 71 మంది అభ్యర్ధులు పోటీ చేశారు. మొత్తం 3,85,996 ఓట్లు పోలవగా వాటిలో 3,151 చెల్లని ఓట్లున్నాయి. ఒక్కో రౌండ్‌లో 56,000 ఓట్లు చొప్పున మొత్తం ఏడు రౌండ్లలో లెక్కించనున్నారు. ప్రస్తుతం మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.