మరోసారి ఇంగ్లాండ్ ఘన విజయం

అహ్మదాబాద్, మోతేరా స్టేడియంలో మంగళవారం జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో ఇండియాపై ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియా 20 ఓవర్లలో 150 పరుగులు చేసి ఆరు వికెట్లను కోల్పోయింది. ఇండియా టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చి 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్ మ్యాన్ అందరూ పెద్దగా పరుగులు తీయకుండానే అవుటయ్యారు. 

రెండో టీ20 మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో మాత్రం చాలా నిరాశ పరిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, క్రిస్ జోర్డాన్‌కు రెండు వికెట్లు పడ్డాయి. మిగితా ఒక వికెట్ రనౌట్ అయ్యారు. 

ఇండియా ఇచ్చిన లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 18.2 ఓవర్లలోనే చేదించి ఘన విజయాన్ని సాధించింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్  కేవలం రెండు వికెట్లు కోల్పోయి 158 రన్స్ చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్ మెన్స్ జోస్ బట్లర్ 83, జానీ బేరిస్టో 40 పరుగులతో భాగస్వామ్యాన్ని నెలకొల్పి తమ టీంకు విజయం సాధించిపెట్టారు. ఇండియా బౌలర్లలో యజువేంద్ర చాహల్,  వాషింగ్టన్ సుందర్‌లకు చెరొక్క వికెట్ పడ్డాయి. ఈ విజయంతో ఇంగ్లాండ్ 2-1 తో ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా జోస్ బట్లర్‌కు అవార్డు దక్కింది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ నాలుగో టి20 మ్యాచ్ మార్చి 18వ తేదీన జరుగనుంది.

 ఇండియా 20 ఓవర్లలో 156/6

 ఇంగ్లాండ్ 18.2 ఓవర్లలో 158/2