సాగర్ ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటన

కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఈరోజు నాగార్జునసాగర్ శాసనసభ స్థానానికి, తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. సాగర్ టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన ఈ రెండు స్థానాలకు ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. 

సాగర్, తిరుపతి ఉపఎన్నికల షెడ్యూల్: 

మార్చి 23: నోటిఫికేషన్‌ జారీ, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం 

మార్చి 30: నామినేషన్ల దాఖలుకి గడువు

మార్చి 31: నామినేషన్ల పరిశీలనఏప్రిల్ 3: నామినేషన్ల ఉపసంహరణకు గడువు

ఏప్రిల్ 17: పోలింగ్

మే 2: ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన.