
తెలంగాణ రాజకీయాలలోకి అకస్మాత్తుగా ప్రవేశిస్తున్న వైఎస్ షర్మిళ వచ్చే నెల 9వ తేదీన ఖమ్మం పట్టణంలో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆమె ఖమ్మం జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేతలతో లోటస్‌పాండ్ నివాసంలో ఆదివారం సమావేశమయ్యి బహిరంగ సభ ఏర్పాట్లు, దనైలో ప్రస్తావించవలసియా అంశాల గురించి చర్చించారు. పట్టణంలోని పెవిలియన్ గ్రౌండ్స్ లేదా బిజిఎన్ఆర్ గ్రౌండ్స్‌లో షర్మిళ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఆ పార్టీ ముఖ్యనేత కొండా రాఘవరెడ్డి, జిల్లా వైసీపీ నేతలు రెండు మైదానాలను పరిశీలించారు. ఏప్రిల్ 9న నిర్వహించే ఆ సభలోనే షర్మిళ తన కొత్త పార్టీ పేరు, జెండా, అజెండాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మళ్ళీ రాజన్న రాజ్యం స్థాపించాలనే సదుదేశ్యంతో షర్మిళ పార్టీ ఏర్పాటుచేయబోతున్నట్లు కొండా రాఘవరెడ్డి తెలిపారు.