
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు శాసనసభ, మండలి సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలను, రాష్ట్ర పురోగతిని వివరించారు. ఆమె ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు:
తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.2.38 లక్షలకు పెరిగింది.
కరోనా కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిలో తీవ్ర ఒడిదుడుకులు
ఎదురైనప్పటికీ వాతీ అధిగమించి అభివృద్ధిపదంలో ముందుకు సాగుతోంది. ఆర్ధిక క్రమశిక్షణతోనే
ఇది సాధ్యమైంది. కరోనాను ఎదుర్కోవడంలో కూడా తెలంగాణ ముందుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా
వాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి మొత్తం 250 ఐటి
కంపెనీలు వచ్చాయి. వాటి ద్వారా 5.82 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి.
రాష్ట్రంలో కొత్తగా 15,252 పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి.
వివిద దశలలో ఉన్న వాటి ద్వారా 15.51 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను
పూర్తి చేసి వాటి ద్వారా 20 లక్షల ఎకరాలకు నీల్ల్ అందించింది. ఆ ప్రాజెక్టులు,
మిషన్ కాకతీయ పధకంలో భాగంగా రాష్ట్రంలోని 30,000 చెరువులలో పూడిక
తీసి నీటిని నింపడంతో ఆయా ప్రాంతాలలో భూగర్భజలాలు పెరిగాయి.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలుచర్యల కారణంగా విద్యుత్ రంగంలో
కూడా తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. విద్యుత్ వినియోగంలో జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు
వినియోగమే ఎక్కువగా ఉంది.
పోలీస్ వ్యవస్థను అత్యాధునికంగా తీర్చిదిద్దడంతో రాష్ట్రంలో
శాంతిభద్రతల పరిస్థితి చాలా సంతృప్తికరంగా ఉంది.