సంబంధిత వార్తలు

ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సోమ, మంగళవారాలలో సమ్మె చేయనున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అధ్వర్యంలో జరుగబోయే ఈ సమ్మెలో తొమ్మిది వేర్వేరు యూనియన్లకు చెందిన 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు పాల్గొనబోతున్నారు. కనుక ఈ రెండు రోజులు బ్యాంకింగ్ సేవలు నిలిపోవచ్చు. అయితే ఏటీఎం సేవలకు మాత్రం ఎటువంటి అంతరాయం ఉండబోదు. ప్రైవేట్ బ్యాంకులు యధాతధంగా పనిచేస్తాయి.