
రాష్ట్రంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ మరియు వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ సీటు కోసం 93 మంది పోటీ పడుతుండగా, మొత్తం5,31,268 మంది ఓటర్లున్నారు.
వరంగల్-నల్గొండ-ఖమ్మం సీటు కోసం 71 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండగా మొత్తం5,05,565 మంది ఓటర్లున్నారు.
రెండు నియోజకవర్గాలలో బారీ సంఖ్యలో అభ్యర్ధులు పోటీ పడుతుండటంతో ఈసారి దినపత్రికంత బ్యాలెట్ పేపర్లు ముద్రించి వాటికి సరిపోయేలా పెద్దపెద్ద బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. రెండు నియోజకవర్గాలలో కలిపి మొత్తం 1,530, పోలింగ్ కేంద్రాలలో మొత్తం 7,560 మంది ఎన్నికల సిబ్బంది, 15,000 మంది పోలీసులతో నేడు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
మార్చి 17వ తేదీన ఓట్లు లెక్కించి ఆదేరోజున ఫలితాలు ప్రకటిస్తారు.