వారి పక్కన కూర్చోన్నా జైలుకే!

నేటి నుంచి హైదరాబాద్‌ నగరంలో కార్లు వగైరా వాహనాలు నడిపేవారికి ఓ కొత్త నిబందన అమలులోకి వచ్చింది. మద్యం త్రాగి వాహనం నడుపుతున్న వ్యక్తికి ఎలాగూ జరిమానా, జైలు శిక్ష, లైసెన్స్ రద్దు తప్పవు. అతను లేదా ఆమెతో పాటు పక్క సీట్లో కూర్చొన్న వ్యక్తి కూడా జైలుకు వెళ్లవలసివస్తుందని సైబరాబాద్ పోలీసులు సామాజిక మాద్యమాల ద్వారా హైదరాబాద్‌ నగర ప్రజలకు తెలియజేశారు. మోటార్ వాహన చట్టంలోని సెక్షన్ 188 ప్రకారం కారు నడుపుతున్న వ్యక్తి మద్యం త్రాగినట్లు తెలిసి ఉన్నప్పటికీ పక్కన కూర్చొని ప్రయాణించడం నేరం కనుక ఇద్దరికీ ఒకే రకమైన శిక్ష వర్తిస్తుందని తెలిపారు. ఈ నిబందన నేటి నుంచే నగరంలో అమలులోకి వస్తుందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.