స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 259 మందితో కమిటీ

వచ్చే ఏడాది ఆగస్ట్ 15వ తేదీన భారత్‌ 75వ స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకోనుంది. దానిని అట్టహాసంగా జరుపుకొనేందుకు కేంద్రప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. అందుకోసం కేంద్రప్రభుత్వం ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో 259 మంది ప్రముఖులతో కూడిన ఓ భారీ కమిటీని ఏర్పాటు చేసింది. దానిలో గవర్నర్లు, ముఖ్యమంత్రులు,అధికార, ప్రతిపక్ష రాజకీయనాయకులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులు, సినీరంగ ప్రముఖులు, త్రివిద దళాధిపతులు తదితరులు ఉన్నారు. ఈ కమిటీకి కేంద్రసాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాఘవేంద్ర సింగ్‌ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ కమిటీ తొలి సమావేశం ఈనెల 8వ తేదీన జరుగనుంది.       

ఈ కమిటీలో సభ్యులు: 

• తెలంగాణ సిఎం కేసీఆర్‌, ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ఎల్‌ కే అద్వానీ, సోనియా గాంధీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్రమంత్రులు తదితరులు. 

• సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తదితరులు. 

• అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ఇళయరాజా, కేజె జేసుదాస్, ఎస్‌ ఎస్‌ రాజమౌళి, ఏఆర్ రెహమాన్, ప్రభుదేవా, లతా మంగేష్కర్ తదితరులు. 

• రామోజీరావు, కృష్ణ ఎల్ల, అమర్త్య సేన్ తదితరులు. 

• పీవీ సింధు, మిథాలీ రాజ్, పుల్లెల గోపీ చంద్ తదితరులున్నారు.