
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు-2021కి ఎంపికయ్యారు. ఈ మేరకు అమెరికాకు చెందిన మల్టీ ఎథ్నిక్ అడ్వైజరీ టాస్క్‌ఫోర్స్ ఫోర్స్ జ్యూరీ ప్రకటన చేసింది. గవర్నర్‌గా అధికారిక బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో పాటు తమిళిసై సౌందరరాజన్ అనేక సామాజిక సేవాకార్యక్రమాలు చేపడుతున్నందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు జ్యూరీ ప్రకటించింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో సహా వివిద రంగాలలో కృషిచేస్తున్న మరో 18 మంది మహిళలకు కూడా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు జ్యూరీ ప్రకటించింది. ఈనెల 7వ తేదీన ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వర్చువల్ పద్దతిలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సహా అందరికీ ఈ అవార్డులు అందజేయనున్నారు.