ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాన్వాయ్‌లో చిన్న ప్రమాదం

టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాన్వాయ్‌లో ఈరోజు చిన్న ప్రమాదం జరిగింది. ఆమె ఈరోజు మధ్యాహ్నం కొండగట్టు నుంచి జగిత్యాల వెళుతుండగా కాన్వాయ్‌లో ఆమె ముందున్న కారులో జగిత్యాల ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఉన్నారు. ఆయన కారు కొద్దిగా స్లో అవడంతో దానికీ కవిత ప్రయాణిస్తున్న కారుకి మద్య దూరం తగ్గిపోయింది. ఆ ముందున్న కారును తాకాకుండా తప్పించేందుకు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దాంతో ఆమె వెనుక వస్తున్న మూడు కారులు ఒకదానినొకటి గుద్దుకొన్నాయి. కవిత ప్రయాణిస్తున్న కారు వెనుకభాగం కూడా కొద్దిగా దెబ్బతింది కానీ ఆమెకు, ముందుకారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే సుంకే రవిశంక ర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. రాజారంపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. తరువాత వారు తమ పర్యటనలో ముందుకుసాగారు.