
డికె.అరుణ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడూ...బిజెపిలో వచ్చిన తరువాత కూడా టిఆర్ఎస్ పార్టీయే ఆమె రాజకీయ ప్రత్యర్ధి కనుక సిఎం కేసీఆర్...ఆయన పాలనను గట్టిగానే విమర్శిస్తుంటారు. తాజాగా ట్విట్టర్ వేదికగా ఆమె సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై బాణాలు సందించారు.
మంథనిలో హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి దంపతుల దారుణ హత్యపై డికె.అరుణ స్పందిస్తూ, “ప్రతీ విషయంపై మీడియాతో మాట్లాడే మంత్రి కేటీఆర్ న్యాయవాద దంపతుల హత్యపై ఎందుకు మాట్లాడటం లేదు?మంత్రి తండ్రి చనిపోతే ఆయనను ఓదార్చడానికి వెళ్ళిన సిఎం కేసీఆర్, కొడుకు, కోడలిని పోగొట్టుకొని వేదన అనుభవిస్తున్న వామన్ రావు తండ్రిని ఎందుకు ఓదార్చాలనుకోలేదు? ఈ హత్య కేసులో టిఆర్ఎస్ పార్టీకి చెందినవారున్నందునే వారిరువురూ మౌనం వహిస్తున్నారా? తద్వారా తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెపుతారు,” అంటూ ప్రశ్నించారు. డికె.అరుణ ఏమన్నారో ఆమె మాటలలోనే...