న్యాయవాద దంపతుల హత్య కేసుపై నివేదిక కోరిన గవర్నర్‌

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వామన్ రావు, నాగమణి దంపతుల హత్య ఉదంతంపై గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ హత్య ఘటనకు సంబందించిన సమగ్ర నివేదిక పంపాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కేసుపై త్వరితగతిన విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

వామన్ రావు,నాగమణి  దంపతులు దంపతుల హత్య కేసులో నిందితుడిగా పేర్కొనబడిన బిట్టు శ్రీనుకి మంధని కోర్టు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అలాగే ఈ హత్యలో బిట్టు శీనుకు సహకరించిన శ్రీనుబాబు, రఘులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.