ప్రధాని నరేంద్రమోడీపై మమతా బెనర్జీ విమర్శలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బిజెపిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభ ఎన్నికల దగ్గరపడుతున్న వేళ బెంగాల్‌లో రాజకీయ వేడి మొదలైంది. బుధవారం మమతా బెనర్జీ  చిన్‌సుర్హా జిల్లాలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ బెంగాల్ రాష్ట్రాన్ని బెంగాలీలే పాలించాలి కానీ గుజరాతీలు కాదన్నారు. ప్రధాని మోడీ అబద్ధాలు చెప్పి బెంగాల్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు విద్వేషకారులు, మాయగాళ్ళు అని అన్నారు. భవిష్యత్తులో ప్రధాని మోడీకి అమెరికా మాజీ అధ్యక్షుడుకి పట్టిన గతే పడుతుందని అన్నారు.