
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పూర్తిస్థాయిలో టీఎస్బిపాస్ విధానం అమలులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులను మరింత సులువు చేయుటకు గడచిన సంవత్సరం నవంబర్ 16న ఐటీశాఖ మంత్రి కేటీఆర్ టీఎస్బిపాస్ కొరకు ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ను ప్రారంభించారు. ఇది తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుంది. అపార్ట్మెంట్లు, ఇళ్ళు కత్తిక్దలచినవారు స్వీయ ధ్రువీకరణ పత్రంతో ఈ వెబ్సైట్ ద్వారా టీఎస్బిపాస్ దరఖాస్తులను స్వయంగా లేదా మీసేవ కేంద్రంలోనూ, లేదా టీఎస్బిపాస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా సమర్పించవచ్చునని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ మహానగరంలో టీఎస్బిపాస్ విదానం ద్వారా జీహెచ్ఎంసీ ఇప్పటికే భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం ప్రారంభించింది కూడా. ఈ నూతన విదానం ద్వారా భవన నిర్మాణాలు, లే అవుట్లకు అనుమతులు మరింత సులువుగా లభించనున్నాయి. 75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనాలకు ఎలాంటి అనుమతులు తీసుకోనవసరం అవసరం లేదని అధికారులు తెలిపారు.