నాలుగు బ్యాంకుల ప్రయివేటీకరణ?

కేంద్రప్రభుత్వం ఒకటొకటిగా ప్రభుత్వ రంగసంస్థలను వదిలించుకొంటోంది. వాటిలో అత్యంతలాభదాయకమైన వైజాగ్ స్టీల్, ఎన్టీపీసీ, ఎల్ఐసీ వంటి సంస్థలున్నాయి. గుదిబండగా మారిని ఎయిర్ ఇండియా వంటి సంస్థలు కూడా ఉన్నాయి. పనిలోపనిగా కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా వదిలించుకొనేందుకు కసరత్తు మొదలుపెట్టింది. కొన్ని బ్యాంకులు కార్పొరేట్ కంపెనీలకు, కొందరు పెద్దలకు చెందిన సంస్థలకు భారీగా రుణాలు ఇచ్చి వాటిని వసూలు చేసుకోలేక నష్టాలపాలై సాయం కోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంటాయి. కనుక అటువంటివాటిని కూడా వదిలించుకొనేందుకు కేంద్రప్రభుత్వం సిద్దం అవుతోంది. 

వాటిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. ముందుగా తక్కువ సిబ్బంది ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో తన వాటాలను ఉపసంహరించుకొని ప్రయివేటీకరణ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ 2021-2022 ఆర్ధిక సంవత్సరంలో కనీసం రెండు బ్యాంకులను వదిలించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.