నేపాల్, శ్రీలంకలో కూడా బిజెపి: త్రిపుర సిఎం

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం త్రిపుర రాజధాని అగర్తాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధిష్టానం ఇరుగుపొరుగు దేశాలలో కూడా బిజెపిని విస్తరించే ఆలోచన చేస్తోందని అన్నారు. 2018 సంవత్సరంలో త్రిపురలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అమీషాతో కలిసి ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా అమిత్ షా బీజేపీని శ్రీలంక, నేపాల్‌ దేశాలకు విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత్‌లో సగం రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉందన్నారు. ప్రపంచంలోనే బిజెపికే ఎక్కువ కార్యకర్తలు ఉన్న పార్టీగా అభివర్ణించారు. బిజెపి ఇరుగుపొరుగు దేశాలలో కూడా పెడితే బావుంటుందని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ అన్నారు.