సంబంధిత వార్తలు
ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిళ సోమవారం ఉదయం బెంగళూరు నుండి హైదరాబాద్ చేరుకొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఖమ్మంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆమె ఈనెల 21న చేయవలసిన ఖమ్మం పర్యటనను వాయిదా వేసుకొన్నారు. కనుక ఈరోజు ఆమె హైదరాబాద్,ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల వైసీపీ నేతలతో లోటస్ పాండ్ నివాసంలో సమావేశం కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులలో వైసీపీ ఏవిదంగా ముందుకు సాగాలనే అంశంపై ఈరోజు సమావేశంలో చర్చించనున్నారు. ఒకవేళ తమ పార్టీకి ఉన్న ప్రజాదారణను పరీక్షించుకొనేందుకు వారు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకొంటే అదో సంచలనమే అవుతుంది.