
హైదరాబాద్ మేయర్‌గా ఎన్నికైన జి.విజయలక్ష్మి తొలిరోజే వివాదంలో చిక్కుకొన్నారు. ఆమె మేయర్‌గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలుపుతూ టిఆర్ఎస్ నేత అతీష్ అగర్వాల్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో రోడ్లపై ఆమె ఫోటోతో కూడిన ఫ్లెక్సీ బ్యానర్లను ఏర్పాటుచేశాడు. నెటిజన్లు వాటికి ఫోటోలు తీసి సామాజిక మాద్యమాలలో పెట్టి విమర్శలు గుప్పించారు. ఈ విషయం జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి రావడంతో వారు సిబ్బందితో ఫ్లెక్సీ బ్యానర్లను తొలగింపజేసి వాటిని పెట్టిన అతీష్ అగర్వాల్‌కు లక్ష రూపాయలు జరిమానా విధించారు.
దీంతో మేయర్ విజయలక్ష్మికి ఎటువంటి సంబందమూ లేనప్పటికీ, మేయర్‌గా ఎన్నికైన మొదటిరోజునే ఇటువంటి వివాదంలో చిక్కుకొన్నారు.