నేడు సిద్ధిపేటలో పర్యటించనున్న మంత్రి హరీష్‌రావు

మంత్రి హరీష్‌రావు నేడు సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం జిల్లాలోని రూరల్ మండలం పుల్లూరుబండ చేరుకొని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొంటారు. అనంతరం అక్కడ జరిగే జాతరలో పాల్గొని అక్కడి నుంచి ఇమాంబాద్ చేరుకొని అక్కడ పెద్దమ్మతల్లిని దర్శించుకొని పూజలు చేస్తారు. తరువాత సిద్ధిపేట పట్టణం చేరుకొని మీరా కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభిస్తారు. తరువాత స్థానిక స్టేడియంలో జరుగుతున్న వాలీబాల్ క్రీడల ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటారు.