
ఈరోజు హాలియాలో జరిగిన బహిరంగసభలో సిఎం కేసీఆర్ మొట్టమొదటే వరాలవాన కురిపించారు. ఆ వివరాలు:
1. నల్గొండ జిల్లా మొత్తానికి రూ.186 కోట్లు మంజూరు.
2. జిల్లాలో 844 గ్రామ పంచాయతీలలో ఒక్కో దానికి రూ.20 లక్షలు మంజూరు.
3. మండల కేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు.
4. నల్గొండ మునిసిపాలిటీకి రూ. 10 కోట్లు మంజూరు.
5. మిర్యాలగూడ అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు.
6. జిల్లాలో మిగిలిన అన్ని మునిసిపాలిటీలకు ఒక్కో దానికి కోటి రూపాయలు మంజూరు.
7. ఇవి కాక ఈరోజు నెల్లికల్లులో శంఖుస్థాపన చేసిన 13 ఎత్తిపోతల పధకాలకు రూ. 2,395.68 కోట్లు కేటాయింపు.
8. ఈ ప్రాజెక్టులన్నీ ఏడాదిన్నరలోగా పూర్తిచేస్తాం. లేకుంటే వచ్చే ఎన్నికలలో ప్రజలను ఓట్లు అడగం.