బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఊరట

బిజెపి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఉపశమనం లభించింది. 2016లో ఉస్మానియా విద్యార్దులు బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో నాంపల్లి ప్రత్యేక కోర్టు గతనెల 29న తుదితీర్పులో రాజాసింగ్‌కు ఏడాది జైలుశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. దానిపై రాజాసింగ్ హైకోర్టులో అప్పీల్ చేసుకొన్నారు. ఆయన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు నాంపల్లి ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తునట్లు ప్రకటించింది.