5.jpg)
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండవ హరిత విప్లవం రానుందని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి వ్యవసాయం, వ్యవసాయేతర రంగాలలో ఆశించిన మేర అభివృద్ధి జరిగిందని అన్నారు. రైతులు సంప్రదాయపంటలతో పాటు, సంప్రదాయేతర పంటలైన తృణధాన్యాలు, పామాయిల్ వంటి పంటలను కూడా పండించాలని కేటీఆర్ సూచించారు. ఆ తర్వాత నర్మాలలో ఆహారశుద్ధి కేంద్రానికి భూమి పూజ చేశారు. సిద్ధి కేంద్రానికి 260 ఎకరాల భూమి అందుబాటులో ఉందని అన్నారు. ఈ సంవత్సరం చివరికల్లా ఆహారశుద్ధి కేంద్ర నిర్మాణ పనులను పూర్తిచేస్తామని అన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమలో స్థానిక యువతకు ఉద్యోగ లభించనున్నాయని అన్నారు. రాజన్న సిరిసిల్లజిల్లాలో ఉచిత కేజీ-టు-పీజీ విద్యను ప్రయోగాత్మకంగా అమలుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి మంత్రి కేటీఆర్ తెలిపారు.