
ఖమ్మం కార్పొరేషన్, ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎన్నికల దగ్గరపడుతున్నవేళ అధికార పార్టీపై కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ నేతలపై అధికార పార్టీ నేతలు విమర్శించడం తారాస్థాయికి చేరింది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఖమ్మంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం పట్టణానికి చేసిన అభివృద్ధి శూన్యం అని అన్నారు. ఖమ్మం పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పాలనలోనే జరిగిందని అన్నారు. అధికార పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలు చూస్తే అసలుకు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అనిపిస్తుందని అన్నారు. రాబోవు అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మార్గం సుగమం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని రేణుకా చౌదరి అన్నారు.