ఫిబ్రవరి7న సిఎం కేసీఆర్‌ పార్టీ సమావేశం

సిఎం కేసీఆర్‌ ఈనెల 7న అంటే ఎల్లుండి తెలంగాణ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. దానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీటీసీ చైర్మన్లు, మునిసిపల్‌ మేయర్లు తదితరులు హాజరుకానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్లీనరీ సభల నిర్వహణ, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ కమిటీల నియామకాలు, రాష్ట్రంలో పార్టీ తాజా పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకొనున్నారు. 

కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ టిఆర్ఎస్‌ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే చాలా మాట్లాడారు కనుక ఈ సమావేశంలో బహుశః దీనిపై కూడా నిర్ణయం ప్రకటించడమో లేదా సిఎం కేసీఆర్‌ స్వయంగా స్పష్టత ఇవ్వడమో జరుగవచ్చు. కనుక ఇది చాలా కీలక సమావేశమనే చెప్పవచ్చు.