సంబంధిత వార్తలు

రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి చిత్రాసుబ్రహ్మణ్యం ఈరోజు ఉన్నత విద్యాశాఖ మండలి, జెఎన్టియూహెచ్ ఉన్నతాధికారులతో సమావేశమై ఎంసెట్ సిలబస్ ఏవిధంగా ఉండాలనే అంశంపై చర్చించారు. ఇంటర్ మొదటి సం.మొత్తం సిలబస్, రెండో సంవత్సరంలో 70 శాతం సిలబస్‌ను ఎంసెట్ ప్రవేశపరీక్షలకు సిలబస్‌గా నిర్ణయించారు. ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ యధాతధంగా ఉంటుందని చెప్పారు. ఈరోజు సాయంత్రం దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.