దివ్యాంగులకు టోల్‌గేట్‌ ఫీ మినహాయింపు

కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త తెలిపింది. గురువారం లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్ర రోడ్డురవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ బదులిస్తూ దివ్యాంగులకు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారిలో ఉన్న టోల్ ప్లాజా పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలు రూపొందించాలనుకునే వాహనరంగ సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.