తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకై 2019-20 సం.లో 52 రోజుల పాటు సమ్మె చేశారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రగతి భవన్ కు పిలిపించుకొని మాట్లాడి హామీ ఇచ్చారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెను విరమించారు. ఆర్టీసీ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, ఇతర డిమాండ్లు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. నిన్న సీఎం దగ్గరికి వచ్చిన ఆర్టీసీకి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. దీంతో ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు, ఉద్యోగ భద్రత, వేతనాల పంపు, ఇతర సదుపాయాలు కలుగనున్నాయి. సిఎం నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.