నేటి నుంచి భారత్-ఇంగ్లాండ్‌ టెస్ట్ సిరీస్

ఈరోజు నుంచి భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ చెన్నైలో ఎమ్.ఎ చిదంబరం స్టేడియంలో ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.

 ఆస్ట్రేలియాపై  విజయంతో భారత్ జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఇంగ్లాండ్ కూడా శ్రీలంకపై గెలుపుతో మంచి ఆత్మవిశ్వాసంతో భారత్‌ జట్టును ఎదుర్కొనేందుకు వచ్చింది. అయితే ఇది స్వదేశంలో జరుగుతున్న మ్యాచ్ కాబట్టి మన జట్టుకు అనుకూలంగా ఉంటుంది. 

బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. చిదంబరం స్టేడియం పిచ్ బౌలర్లు అనుకూలంగా ఉంటుంది కనుక ఈ మ్యాచ్‌లో టాస్ కీలకంగా మారనుంది. 

భారత జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ, రహనా,  పూజారా, కేఎల్ రాహుల్, మయుకు అగర్వాల్, రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, వృద్ధిమాన్ సాహో, రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ, బూమ్రా, శార్దుల్ ఠాకూర్, సిరాజ్.

ఇంగ్లాండ్ జట్టు వివరాలు: బర్న్,  సీబ్లీ,  లారెన్స్, రూట్, స్టోక్స్, ఓలి, పొప్, బట్లర్, మొయిన్ అలీ, ఆర్చర్, జాక్, లీచ్, అండర్సన్. 

మ్యాచ్ ప్రారంభం అయ్యే ముందు జట్టులో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఈ మ్యాచ్‌లకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించబోతున్నట్లు బీసీసీఐ ఇది వరకే ప్రకటించింది కనుక మళ్ళీ చాలా రోజుల తరువాత ప్రేక్షకుల సమక్షంలో జరుగబోయే ఈ మ్యాచ్‌లు చాలా ఉల్లాసంగా...ఉత్సాహంగా సాగబోతున్నాయి.