చెన్నమేని పౌరసత్వ కేసులో కేంద్రం అఫిడవిట్

వేములవాడ తెరాస ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం పై కేసు నేడు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా కేంద్ర హోంశాఖ చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరసత్వం కలిగి ఉన్నాడని తెలియజేస్తూ అఫిడవిట్‌ను హైకోర్టుకు సమర్పించింది.

చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నందున శాసనసభ ఎన్నికకు అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ బిజెపి నేత ఆది శ్రీనివాస్ పిటిషన్ కొంతకాలం క్రితం వేశారు. ఆ కేసు వాయిదాల పర్వం నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఈరోజు కేంద్ర హోంశాఖ ఇచ్చిన అఫిడవిట్ చెన్నమనేని రమేష్ తీర్పులో కీలకంగా మారనుంది. వీలైనంత త్వరగా కేసు పూర్వాపరాలను పరిశీలించి నివేదిక అందించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర హోం శాఖ ఇచ్చిన అఫిడవిట్ తో వేములవాడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.